Friday, March 29, 2024
HomeTrending Newsబిజెపి జేబు సంస్థలతో కక్ష సాధింపు - శ్రీనివాస్ గౌడ్

బిజెపి జేబు సంస్థలతో కక్ష సాధింపు – శ్రీనివాస్ గౌడ్

కేంద్రం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈడి, ఐటి సంస్థలను కేంద్రంలోని బిజెపి సర్కారు తమ జేబు సంస్థలుగా మార్చుకుని కక్ష సాధింపులకు పాల్పడుతోందన్నారు. మహబూబ్ నగర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విలేఖరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, అంజయ్య యాదవ్, నరేందర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ నిజాం పాషా, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్ తదితరులు పాల్గోన్నారు.

ఎమ్మెల్సీ కవితపై కుట్రలు, మంత్రి గంగులపై ఈడి దాడులు, మరో మంత్రి మల్లారెడ్డిపై ఐటి దాడులతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనట్లు ఒక తెలంగాణలో మాత్రమే తప్పులు జరుగుతున్నాయి అన్నట్లు కేంద్రం ప్రవర్తిస్తున్నదన్నారు. మిగతా రాష్ట్రాలతో పెట్టుకోవచ్చు కానీ తెలంగాణతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ గొంతు పిసికేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దేశవ్యాప్తంగా అనేక నూతన మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా… తెలంగాణకు కేవలం ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర నాయకులు దాడులకు భయపడరని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కేంద్రం కుట్రలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి మాత్రం కేవలం అభివృద్ధిపైనే ఉంటుందని, మాకు ఇలాంటి కుట్రల అవసరం లేదన్నారు. కేంద్రం చేస్తున్న దాడులకు భయపడం, ప్రతిదాడులకు సిద్ధం. మేం చేతులు ముడుచుకోబోమని తేల్చి చెప్పారు. స్వయం ప్రకాశితంగా ఎదుగుతున్న తెలంగాణపై కేంద్రం చేస్తున్న ముప్పేట దాడులను, కుట్రలను దేశ ప్రజలంతా గమనించాలని కోరారు. వచ్చేనెల నాల్గవ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Also Read :  భయపడేవాళ్ళు లేరు: కవిత 

RELATED ARTICLES

Most Popular

న్యూస్