Gazette soon:
ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటుపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించిన గత ప్రభుత్వం ఆ తర్వాత దానిపై పట్టించుకోలేదని, కానీ సిఎం జగన్ యూనివర్సిటీ మంజూరు చేయడంతో పాటు దీనిపై చట్టం కూడా చేశారని అయన వివరించారు.
రేపటిలోగా గండి పూడ్చాలి: మంత్రి అల్టిమేటం
కాగా, జిల్లాకు చెందిన ఇరిగేషన్ అధికారులపై మంత్రి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న కండలేరు గండిని పూడ్చకపోవడంపై అయన సీరియస్ అయ్యారు. రేపు మధ్యాహ్నంలోగా అధికారులు గండి పూడ్చకపోతే ఆ తర్వాత తాను స్వయంగా చెరువులోకి దూకి గండి పూడ్చుతానని హెచ్చరించారు. కాగా అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు.
Also Read : క్యాపిటల్ కాదు, క్యాపిటలిస్టుల సభ : రోజా