Saturday, November 23, 2024
HomeTrending Newsత్వరలో డయాలసిస్ సేవలు - తలసాని

త్వరలో డయాలసిస్ సేవలు – తలసాని

హైదరాబాద్ అమీర్ పేటలోని హాస్పిటల్ లో డయాలసిస్ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్ పేట లో 4.53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల హాస్పిటల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు ప్రారంభించారు.

హాస్పిటల్ కు వచ్చే పేషంట్స్ కోసం అల్ట్రా సౌండ్ స్కానర్, ECG, ఎక్స్ రే, ఇతర అత్యాధునిక వైద్య పరికరాలను 50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ హాస్పిటల్ ద్వారా అమీర్ పేట, సనత్ నగర్, జూబ్లీహిల్స్,  పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రభుత్వ వైద్య సేవల కోసం దూర ప్రాంతాల్లో ఉన్న గాంధీ, ఉస్మానియా వంటి హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్ లో ఈ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పారు.  హాస్పిటల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మరో 50 పడకల  హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని TSMIDC అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో MLC సురభి వాణి దేవి, కలెక్టర్ శర్మన్, TSMIDC MD చంద్ర శేఖర్ రెడ్డి, CE రాజేంద్ర కుమార్, హాస్పిటల్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సునీత, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్