Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం

నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం

Grand Welcome: టర్కీలో గతవారం జరిగిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 52 కిలోల విభాగంలో విజేతగా నిలిచి తొలిసారి హైదరాబాద్ చేరుకున్న నిఖత్ జరీన్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,  శాప్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, క్రీడా శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు.

జరీన్ తో పాటు షూటింగ్ జూనియర్ వరల్డ్ కప్ లో మూడు బంగారు పతకాలు సంపాదించిన ఈశా సింగ్, భారత మహిళల ఫుట్ బాల్ జట్టు మెంబర్ సౌమ్య గుగులోత్ లకు కూడా మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. దారి పొడవునా క్రీడాకారులు, పలు పాఠశాలల విద్యార్ధులు జాతీయ జెండాలు చేత బూని తమ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : చరిత్ర సృష్టించిన జరీన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular