Sunday, March 15, 2026
HomeసినిమాMirna Menon: ఇక మిర్నా మీనన్ ఆశలన్నీ 'జైలర్'పైనే! 

Mirna Menon: ఇక మిర్నా మీనన్ ఆశలన్నీ ‘జైలర్’పైనే! 

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో చాలామంది కథానాయికలు పరిచయమయ్యారు. కానీ దురదృష్టం కొద్దీ ఎవరు చేసిన సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. కావలసినంత గ్లామర్ .. అవసరమైనంత అభినయం ఉన్నప్పటికీ ఫ్లాపుల బారిన పడిన ఈ ముద్దుగుమ్మలు, ఇప్పుడు మరో ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక గతంలో ఒకటి రెండు సినిమాలు చేసి, ఆ తరువాత కాస్త వెనక్కి వెళ్లి ముందుకు వచ్చిన హీరోయిన్స్ కూడా లేకపోలేదు. అలాంటివారి జాబితాలో ‘మిర్నా మీనన్’ ఒకరుగా కనిపిస్తుంది.

2016 లోనే మిర్నా మీనన్ తమిళ సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైంది. ఆ తరువాత 2022లో ‘క్రేజీ ఫెలో’ సినిమాలో ఆది సాయికుమార్ జోడీగా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆడకపోవడం వలన ఆమెను ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. దాంతో మళ్లీ ఆమె వెనక్కి వెళ్లిపోయి తమిళ సినిమాలు చేసుకుంటూ ఉండగా, ‘ఉగ్రం’ సినిమాతో మరోసారి టాలీవుడ్ నుంచి ఆఫర్ వెళ్లింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేశ్ సరసన నాయికగా ఆమె నటించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది.

నిజానికి ‘ఉగ్రం’పై మంచి అంచనాలు ఉన్నాయి. ‘నాంది’ సినిమా కాంబినేషన్ కావడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని అంతా భావించారు .. కానీ ఈ సినిమా ఆ స్థాయిలో కనెక్ట్ కాలేక పోయింది. దాంతో మిర్నా మీనన్ కాస్త నిరాశపడిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ రజనీకాంత్  ‘జైలర్’పైనే ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన రోల్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాతోనైనా తనకి మంచి గుర్తింపు లభిస్తుందేమో అనే ఆశతో ఆమె వెయిట్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular