Sunday, January 19, 2025
HomeTrending Newsనాడు-నేడుపై విమర్శలు దారుణం : ఆళ్ళ

నాడు-నేడుపై విమర్శలు దారుణం : ఆళ్ళ

ఉన్నత విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలంగా నమ్ముతారని మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్నారు. దీనిలో భాగంగానే మన బడి-నాడు నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. నాడు నేడు కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ విష ప్రచారానికి కొన్ని మీడియా సంస్థలు వంత పాడడం దురదృష్టకరమని ఆళ్ళ వ్యాఖ్యానించారు.  చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోలేదని, కానీ తమ ప్రభుత్వం నాడు-నేడు ద్వారా మరమ్మతులు చేయించారని ఆళ్ళ గుర్తుచేశారు. ప్రభుత్వం చేస్తోన్న మంచిని ఓ పత్రిక జీర్ణించుకోలేకపోతోందని, ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తోందని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. లక్షలాది రూపాయల జీతాలిచ్చి, తమ పార్టీ నాయకుల వాయిస్ ను కట్ అండ్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, గత ఎన్నికల సమయంలో మంగళగిరిలో కూడా ఇదే తరహా ప్రచారాన్ని చేశారని ఆర్కే గుర్తు చేశారు. నారా లోకేష్ ఆధ్వ్యరంలో టిడిపి సోషల్ మీడియా బృందం ఈ దుశ్చర్యలకు పాల్పడుతుందన్న అనుమానాన్ని అయన వ్యక్తం చేశారు. కనీసం వందమందిని నియమించుకొని ఒక్కొకరికీ లక్ష రూపాలయ జీతాలిచ్చి ఈ పని చేయిస్తున్నారని ఆరోపించారు.  మా పార్టీని దెబ్బ తీయడానికి ఇంత నీచ స్థితికి దిగజారాలా అని అయన సూటిగా ప్రశ్నించారు. ఏ మహిళా తన పరువు పోయే విధంగా ఇలా లీకులు ఇవ్వబోరని, లోకేష్ బృందం ఇలాంటి పనులు చేయడం మంచిపద్ధతి కాదని అయన హితవు పలికారు. ప్రజలు ఇలాంటి వ్యవహారాలను గమనించాలని ఆళ్ళ కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్