Saturday, February 22, 2025
Homeసినిమాభగత్‌ సింగ్‌ నగర్‌ విజయం సాధించాలి : ఎమ్మెల్యే ఆకాంక్ష

భగత్‌ సింగ్‌ నగర్‌ విజయం సాధించాలి : ఎమ్మెల్యే ఆకాంక్ష

Bhagat Singh Nagar:
గ్రేట్‌ ఇండియా మీడియా హౌస్‌ పతాకంపై విదార్థ్‌, ధృవిక హీరో హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తులు నిర్మించిన‌ చిత్రం ‘భగత్‌ సింగ్‌ నగర్‌’. ఈ చిత్ర బృందం విజయనగరంలోని ఓ మల్టీప్లెక్స్‌ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది. మన విజయనగరం వాసి నిర్మించిన ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ‘విజయనగరానికి చెందిన ఉడత్తుకాశీ కుమారుడైన రమేష్‌ నిర్మించిన సినిమాను ఆదరించి విజయవంతం అయ్యేలా చూడాల’ని కోరారు. డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, కౌశిక్‌లు మాట్లాడుడూ ‘మంచి కథ, విలువలతో కూడిన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని, విజయనగరం జిల్లాకు చెందిన రమేష్‌ సినిమాను నిర్మించడం సంతోషంగా ఉందని, ఈ సినిమా విజయవంతమై భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నిర్మించాలని’ అభిలషించారు.

తెలుగు మరియు తమిళ భాషలలో  ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్‌ ను ప్రకాష్‌ రాజ్‌ విడుదల చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి చక్కని గుర్తింపు లభించిందని దర్శకుడు క్రాంతి అన్నారు. భగత్‌ సింగ్‌ నగర్‌ నుంచి విడుదలైన ‘చరిత చూపని’ అనే లిరికల్‌ సాంగ్‌ కు 1మిలియన్‌ వ్యూస్‌ సాధించిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు  తెలిపారు. అతి త్వరలో మిగిలిన పాటలతో పాటు, సినిమాను ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని అన్నారు.

చిత్ర నిర్మాత రమేష్‌ ఉడత్తు మాట్లాడుతూ “దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరుడు భగత్‌ సింగ్‌ అని, ఎక్కడో పుట్టి పెరిగిన బ్రిటీష్‌ వారు మనదేశంలో అడుగుపెట్టి వారి సామ్రాజ్యాన్ని ఇండియాలో స్థాపించాలన్న కలను చెదరగొట్టి వారిని, వారి సామ్రాజ్యాన్ని మనదే శ పొలిమేరల వరకు తరిమికొట్టి చిరుప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్‌ అని, ఇలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్‌ హంగులతో సినిమాగా తీసినందుకు మా కెంతో గర్వంగా ఉందని” అన్నారు.

Also Read :డిసెంబర్ 10న థియేటర్స్ లో విడుదలవుతున్న గమనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్