Sunday, November 24, 2024
HomeTrending NewsSSC Paper Leak: బండి అరెస్టుపై బిజెపి నిరసనలు.. ఉద్రిక్తత

SSC Paper Leak: బండి అరెస్టుపై బిజెపి నిరసనలు.. ఉద్రిక్తత

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్ట్ ను నిరసిస్తూ బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు…బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లను బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ‘‘ఛలో బొమ్మల రామారాం’’ పిలుపునిచ్చిన మేడ్చల్ జిల్లా బీజేపీ నేతలు. భారీ ఎత్తున బొమ్మల రామారాం తరలివస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు…మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

బండి సంజయ్ అరెస్ట్ వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పై పోలీసుల దాష్టీకం. రఘునందన్ ను చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లిన మఫ్టీలోనున్న పోలీసులు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలన్న రఘునందన్.. పోలీసులతో తీవ్ర వాగ్వాదం చేశారు. మఫ్టీలో ఉంటూ మెడపై చేయి లాగుతూ దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ రఘునందన్ తీవ్ర ఆగ్రహం. బొమ్మల రామారాం వద్ద అరెస్ట్ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

లీకు కుట్రలో బండి సంజయ్ ను ఇరికించే యత్నం జరుగుతోందని బిజెపి ఇమ్మేల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కేటీఆర్ కు ఎవరైనా వాట్సప్ చేస్తే ఆయనను అరెస్ట్ చేస్తరా అని ప్రశ్నించారు. టీవీ ఛానళ్లన్నీ టెన్త్ పేపర్ లీకుపై వార్తలు ప్రసారం చేశాయి. వాళ్లందరినీ అరెస్ట్ చేస్తారా?..పరీక్ష మొదలయ్యాక పేపర్ బయటకు వస్తే అది మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తుందని, మాల్ ప్రాక్టీస్ కేసు విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రాజశేఖర్ బీజేపీ వాడంటూ దుష్ప్రచారం చేస్తే ఏమైందని, రాజశేఖర్ ఐటీశాఖ పరిధిలోని టీఎస్టీఎస్ శాఖ ఉద్యోగి, కేటీఆర్ మంత్రి పీఏకు సన్నిహితుడని తెలిందన్నారు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగ బద్ద సంస్థ తమకేం సంబంధం అని ప్రశ్నిస్తున్న కేటీఆర్… టెన్త్ పేపర్ తప్పిదాలపై ఏం జవాబు చెబుతారని బిజెపి నేతలు ప్రశ్నించారు.

పోలీసుల అష్ట దిగ్బంధంలో బొమ్మల రామారాం. బొమ్మల రామారాం వైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికెడ్లు పెట్టిన పోలీసులు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి. ఈరోజు కోర్టుకు సెలవు దినం కావడంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లి హేబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసిన బీజేపీ లీగల్ విభాగం నేతలు. కాసేపట్లో హైకోర్టులో హౌజ్ మోషన్ దాఖలు చేయనున్న బీజేపీ లీగల్ టీం నేతలు. హౌజ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ కాసేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read : SSC paper leak: పదో తరగతి తెలుగు పేపర్ లీక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్