Thursday, March 28, 2024
HomeసినిమాSushanth: సుశాంత్ మిస్ చేసుకున్న హిట్ మూవీ!

Sushanth: సుశాంత్ మిస్ చేసుకున్న హిట్ మూవీ!

అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘కాళిదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో సుశాంత్. తొలి సినిమాతోనే నటుడుగా ఆకట్టుకున్నాడు కానీ.. కమర్షియల్ సక్సెస్ మాత్రం సాధించలేదు. ఆ తర్వాత నటించిన కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా చిత్రాలు కూడా  ఓకే అనిపించాయి కానీ.. చెప్పుకోదగ్గ  బ్రేక్ ఇవ్వలేదు. కొంత గ్యాప్ తర్వాత  రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ‘చిలసౌ’ అనే సినిమా చేశాడు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుశాంత్ కి మంచి విజయాన్ని అందించింది.

ఆ తర్వాత  కూడా పెద్ద అవకాశాలు ఏమీ రాలేదు.  దీనితో సోలో హీరోగానే కాకుండా.. ఇంపార్టెంట్ రోల్స్ వస్తే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలాంటి టైమ్ లో వచ్చిన అవకాశమే ‘అల.. వైకుంఠపురములో’. ఇందులో సుశాంత్ కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత సోలో హీరోగా చేసిన ఇచ్చట వాహనాలు నిలుపరాదు చిత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. రవితేజ, సుశాంత్ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి థ్రిల్ కలిగిస్తాయని చెబుతున్నారు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో సుశాంత్ ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టాడు. సుశాంత్ తన కెరీర్ లో ఓ బిగ్ సినిమాను మిస్ చేసుకున్నాడట. ఆ సినిమాను మరో యంగ్ హీరో చేసి హిట్ అందుకున్నాడు. ఆ హీరో హీరో శర్వానంద్ కాగా.. ఆ సినిమా ఎక్స్ ప్రెస్ రాజా. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఛాన్స్ ముందుగా సుశాంత్ కు వచ్చిందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులో నటించలేకపోయానని తెలిపాడు సుశాంత్. ఇప్పుడు సుశాంత్ కెరీర్ మంచి ట్రాక్ లోకి వచ్చింది. మరి.. ఇక నుంచైనా వరుసగా సక్సెస్ సాధిస్తూ.. సోలో హీరోగా బిజీ అవుతాడేమో.

Also Read :  Sushanth: ‘రావణాసుర’ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది : సుశాంత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్