Tuesday, June 16, 2026
HomeTrending Newsఎమ్మెల్యే ప్రోద్భలంతోనే దాడి: అచ్చెన్నాయుడు

ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే దాడి: అచ్చెన్నాయుడు

యువ గళం పాదయాత్ర సందర్భంగా నిన్న నారా లోకేష్ పై జరిగిన దాడి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రోద్భలంతోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు.

“శ్రీ నారా లోకేశ్ గారి పాదయాత్రలో జన ప్రభంజనం చూసి జగన్‌కు ఏసీలో ఉన్నా చెమటలు పడుతున్నాయి. అందుకే అల్లరి మూకలను రెచ్చగొట్టి పాదయాత్రకు అడ్డంకులు స‌ృష్టిస్తున్నారు. లోకేశ్‌ గారిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది. పాదయాత్ర పై కోడిగుడ్లు విసిరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. #YuvaGalamPadayatra” అంటూ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular