Saturday, November 23, 2024
HomeTrending Newsసిఎంతో గిరిజన ఎమ్మెల్యేల భేటి

సిఎంతో గిరిజన ఎమ్మెల్యేల భేటి

ST MLAs with CM:
డిప్యూటీ ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పాముల పుష్పశ్రీవాణి నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శాసనసభలోని అయన ఛాంబర్ లో కలుసుకున్నారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయ కళావతి,  చెట్టి ఫాల్గున, కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు, స్ధానిక సమస్యలను ఎమ్మెల్యేలు సిఎం దృష్టికి తీసుకువెళ్ళారు. గిరిజన ప్రాంతాల అభివృద్దికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే తీసుకోవాలని సిఎం జగన్ తన కార్యాలయ అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు.  ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం ఉపాధి హమీ పనుల ద్వారా నిర్ధేశించిన రోడ్లను పూర్తి చేయడం, ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్‌ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్ళేందుకు అవసరమైన రైస్‌ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం వంటి పలు అంశాలను గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు.

జీవో నెంబర్‌ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచించిన సీఎం, షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు తెలియజేశారు.  గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటికీ వెంటనే పరిష్కారం లభించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు.

Also Read : శాసనమండలి రద్దు నిర్ణయం వెనక్కి: బుగ్గన

RELATED ARTICLES

Most Popular

న్యూస్