Thursday, March 28, 2024
Homeతెలంగాణవ్యక్తిత్వం కోల్పోయిన ఈటెల : జీవన్ రెడ్డి

వ్యక్తిత్వం కోల్పోయిన ఈటెల : జీవన్ రెడ్డి

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడానికి నిశ్చయించుకొని తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటెల నిజంగా ఉద్యమకారుడైతే బిజెపిలో చేరి ఉండేవారు కాదని, పరుల పంచన చేరడాన్ని తెలంగాణ సమాజం హర్షించదని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడేళ్ళుగా చేస్తున్న అవినీతికి బిజెపి రక్షణ కవచంగా నిలిచిందని ఆరోపించారు.

ఏదో ఒక రాజకీయ పార్టీలో చరడానికి కేసియార్ తో ఈటెల విభేదించాల్సిన అవసరం లేదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజేందర్ బిజెపిలో చేరతాడని ఊహించలేదన్నారు. బిజెపిలో చేరడం ఈటెల బలహీనతను తెలియజేస్తుందన్నారు. ఈటెల తన స్థాయి తానే తగ్గించుకున్నారన్నారు. దీనితో అయన నియోజకవర్గ నేతగానే పరిమితమయ్యారని జీవన్ రెడ్డి ఖ్యానించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈటెల 50 వేల మెజార్టీతో గెలిచి ఉండేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీపై ఈటెల చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి ఖండించారు, కాంగ్రెస్ లో చేరడం, చేరకపోవడం అయన ఇష్టమని కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ నడిపిస్తుంది రాహుల్ గాంధీ అని స్పష్టం చేశారు. పార్టీని ఎవరో కంట్రోల్ చేస్తున్నారంటూ ఈటెల మాట్లాడడం అవివేకమన్నారు.
పిసిసి అధ్యక్ష పదవిపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడికే ఆ పదవి ఇస్తారని, బైట వాళ్లకు ఇవ్వరు కదా అని నిట్టూర్చారు, పార్టీలో అందరూ ఒకటేనని, పాతవారు, బయటోల్లు… కొత్త వాళ్ళు అని ఉండరని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్