Sunday, November 24, 2024
HomeTrending Newsమహిళా బిల్లు కోసం పోరాడతాం - ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లు కోసం పోరాడతాం – ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతామని కవిత తెలిపారు.  c బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష సాయంత్రం ముగిసింది. ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన కల్వకుంట్ల కవిత మోదీ సర్కార్ తల్చుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందని అన్నారు. తన దీక్షకు మద్దతు తెలిపిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఎమ్మెల్సీ క‌విత‌కు ఎంపీ కే కేశ‌వ‌రావు నిమ్మర‌సం ఇచ్చి దీక్షను విర‌మింప‌జేశారు.

చట్టసభల్లో మహిళలకు సాధికారత కల్పించడంపై కేంద్రం హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆప్‌ ఎంపీ సంజయ్‌. కవిత దీక్షకు మద్దతు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ కోసం కవిత చేస్తున్న దీక్షకు వివిధ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపారు.

ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కవిత దీక్షకు వారంతా మద్దతు తెలిపారు. దీక్షకు మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, పలువురు ఎమ్మెల్యేలు రేఖానాయక్, పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మద్దతు పలికారు. దేశంలోని 18 పార్టీల నాయకులు సంఘీభావం పలికారు. దీక్ష సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది. విమహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరుగుతున్న ఈ దీక్షలో విధ మహిళా సంఘాలు నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్