Friday, March 20, 2026
Homeసినిమా‘జెంటిల్‌మేన్‌-2` కు సంగీత ద‌ర్శ‌కుడిగా ఎం.ఎం.కీర‌వాణి

‘జెంటిల్‌మేన్‌-2` కు సంగీత ద‌ర్శ‌కుడిగా ఎం.ఎం.కీర‌వాణి

ప్ర‌ముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ నిర్మించిన జెంటిల్ మెన్‌, కాద‌లన్ (ప్రేమికుడు), కాద‌ల్ దేశం (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాష‌ల‌లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌ గా నిలిచాయి. సినిమా ప‌బ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ప‌తాకంపై తన సూపర్ హిట్ సినిమా జెంటిల్ మేన్‌ కు సీక్వెల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమాకు సంబందించి ఇటీవ‌ల ట్విట్టర్ లో ఒక కాంటెస్ట్‌ ను నిర్వ‌హించారు. #G2MusicDirector అనే హ్యాష్ ట్యాగ్ తో త‌న‌ జెంటిల్ మేన్ 2 చిత్రానికి సంగీతం చేయబోతున్న లెజెండరీ సంగీతకారుడిని ఊహిస్తే ..అదృష్ట‌వంతులైన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడుతుందని తెలిపారు. ఇప్పుడు జెంటిన్‌మేన్ 2 సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా స్వ‌ర‌వాణి కీర‌వాణి ప‌నిచేస్తున్నార‌ని నిర్మాత కుంజుమ‌న్ ప్ర‌క‌టించారు.

`భారతీయ సినిమా యొక్క ఐకానిక్ లెజెండ్, ఎం.ఎం. కీరవాణి గారు, నా జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తోన్న ‘జెంటిల్ మేన్ 2` చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని నేను గర్వంగా ప్రకటిస్తున్నాను. త్వ‌ర‌లోనే బంగారునాణేల విజేతలను కూడా ప్రకటిస్తాను అని ప్ర‌ముఖ నిర్మాత కే.టి కుంజుమ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాకు సంబందించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular