Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్సౌతాఫ్రికా క్లీన్ స్వీప్

సౌతాఫ్రికా క్లీన్ స్వీప్

Clean Sweep: ఇండియా-సౌతాఫ్రికా మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకు  ఆలౌట్ అయ్యింది.  చివర్లో దీపక్ చాహర్, బుమ్రా జోడీ ఎనిమిదో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యంతో విజయం వైపు తీసుకెళ్ళినా…. చాహర్, బుమ్రా అవుట్ కావడంతో పరాజయం తప్పలేదు. ఇండియా 18 పరుగులకే తొలి వికెట్ (కెప్టెన్ రాహుల్-9) కోల్పోయింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్- విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్ కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శిఖర్ -61; కోహ్లీ 65 పరుగులు చేసి ఔటయ్యారు. రిశభ్ పంత్ డకౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్-26; సూర్య కుమార్ యాదవ్-39… చివర్లో చాహర్-54 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి, పెహ్లుక్యాయో చెరో మూడు; ప్రేటోరియస్ రెండు; మగల, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ పడగొట్టారు.

కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికాలో ఓపెనర్ డి కాక్ సెంచరీ(124);  వాన్ డర్ దస్సేన్ (52)అర్ధ సెంచరీ తో రాణించడంతో సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డేవిడ్ మిల్లర్-39; ప్రిటోరియస్ -20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు; దీపక్ చాహర్, బుమ్రా చెరో రెండు; యజువేంద్ర చాహల్ ఒక వికెట్ పడగొట్టారు.

ఇండియా జట్టులో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి, బెంచ్ లో ఉన్న ఆటగాళ్లకు స్థానం ఇవ్వాలన్న ఉద్దేశంతో భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్, ప్రసిధ కృష్ణ, దీపక్ చాహర్ లకు అవకాశం కల్పించారు.

సెంచరీ సాధించిన డికాక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ కూడా దక్కింది.

Also Read : ప్రొ కబడ్డీ:  హర్యానా, బెంగుళూరు గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్