Sunday, January 19, 2025
HomeTrending NewsAAP-BRS: దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం - ముఖ్యమంత్రుల ఆందోళన

AAP-BRS: దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం – ముఖ్యమంత్రుల ఆందోళన

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి మేయర్ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ మేయర్ సీటును కైవసం చేసుకుందని గుర్తు చేశారు. హైదీరాబాద్ ప్రగతి భవన్ లో ఈ రోజు సమావేశమైన ముగ్గురు ముఖ్యమంత్రులు సుదీర్గంగా చర్చించారు. కేంద్రంపై పోరాటంలో ఆప్ నేతలకు సహకరిస్తామని కెసిఆర్ భరోసా ఇచ్చారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రులు… కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…గ్రూప్-1 అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ను కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని, ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి…ఆ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇందిరా గాంధీ లాంటి నాయకులకే ఓటమి తప్పలేదని, కేంద్రం ఇందిరా గాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలో ఉన్నదాని విమర్శించారు. ఆర్డినెన్స్ ను ఓడించేందుకు కేజ్రీవాల్ కు తమ మద్దతు ఉంటుందని కెసిఆర్ మద్దతు ప్రకటించారు. లోక్ సభ, రాజ్యసభ లో కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని, మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.

ఎమర్జెన్సీ వచ్చే ముందు వాతావరణం మాదిరి ఇప్పుడు దేశంలో ఇలాగే జరుగుతోందని, కర్ణాటక ప్రజలు బీజేపీకి సరైన సమాధానం చెప్పారు..భవిష్యత్ లో దేశం అంతా నేర్పుతుందని కెసిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ..గవర్నర్లు ఏంది? గవర్నర్ వ్యవస్థతో పాలన ఎక్కడికి వెళ్తుందో దేశం అంతా గమనిస్తోందన్నారు. వంగి వంగి కోతి దండాలు పెట్టినా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. దేశంలో కేంద్రప్రభుత్వ ఆగడాలు, అరాచకాలు ఎక్కువైయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వాలను సరిగ్గా పనిచేయనియ్యడం లేదన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులను సృష్టిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…విపక్ష పార్టీలు ఉన్న ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి

ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నప్పుడు అధికారాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉండే…ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే అధికారాలను తీసివేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 8 ఏళ్ళు ఢిల్లీ ప్రజల కోసం పోరాటం చేసామని…సుప్రీంకోర్టు లో 8 ఏళ్ల తరువాత న్యాయం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు లో న్యాయం జరిగినా..దానిని కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని, సుప్రీంకోర్టులోనే న్యాయం జరగకపోతే దేశ ప్రజలు ఎక్కడి వెళ్లి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు ఛాలెంజ్ చేస్తున్నారని, నాన్ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రాన్ని కేంద్రం పాలన చేసుకొనివడం లేదని మండిపడ్డారు. ED, సీబీఐ పంపి బెదిరించి ఎమ్మెల్యేలను కొంటారు ప్రభుత్వాలను కూల్చుతారని ఆరోపించారు. దేశమంతా తిరుగుతా…దేశ ప్రజల కోసం పనిచేస్తానని, రాజ్యసభలో ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని నాన్ బీజేపీ పార్టీలను కోరారు. ఆర్డినెన్స్ ను అడ్డుకోని మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘ చర్చ జరిగిందని, ఈ పోరాటం ఢిల్లీ కోసం మాత్రమే కాదు దేశం కోసమన్నారు. ఈ పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతోందని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

పంజాబ్ సీఎం మాన్ సింగ్

దేశ ప్రజల హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని పంజాబ్ సిఎం భగవంత్  సింగ్ మాన్ వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నడిచేందుకు గవర్నర్ సహకరించలేదు..సుప్రీంకోర్టు కు వెళ్లాల్సి వచ్చిందని మాన్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో గవర్నర్ బడ్జెట్ సమావేశాల్లో నా ప్రభుత్వం అని చదువుతూ ప్రారంభించారని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ నిలిపివేశారని ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇండియా… ఒకే పువ్వు ఉండటం కుదరదని తేల్చి చెప్పారు. దేశం ఒక మాల లాంటిదని ఆ పూల మాలలో అన్ని రకాల పూలు ఉంటాయని పంజాబ్ సిఎం వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్