Thursday, March 12, 2026
HomeTrending NewsUCC Bill: వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లు?

UCC Bill: వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లు?

మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానుండగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరో సాహసానికి దిగనుందనే వార్తలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేసి దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మోడీ ప్రభుత్వం ఆ తర్వాత కీలకమైన అయోధ్య వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించింది. ఇప్పుడు భారతీయ న్యాయ చరిత్రలో అనేక వివాదాలకు పరిష్కారం చూపే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును తీసుకు రానుందని విశ్వసనీయ సమాచారం.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ బిల్లును పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ పంప‌నున్నారు. ఉమ్మడి పౌర‌స్మృతిపై ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఆ అంశానికి ప్రాముఖ్య‌త‌ సంత‌రించుకున్న‌ది. స్టాండింగ్ క‌మిటీకి బిల్లును పంపిన స‌మ‌యంలో అక్క‌డ లా ప్యాన‌ల్‌, లీగ‌ల్ అఫైర్స్ టీమ్ ప్ర‌తినిధులు అభిప్రాయాలు విన‌నున్నారు.

జూలై మూడ‌వ వారంలో పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. స‌మావేశాల‌ను ఈసారి కొత్త భవనంలో నిర్వ‌హించ‌నున్నారు. అయితే యూసీసీపై ఇప్ప‌టికే విప‌క్ష పార్టీలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుని వ్య‌తిరేకించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular