Sunday, January 19, 2025
Homeజాతీయంప్రపంచాన్ని మార్చేసిన కరోనా : మోడీ

ప్రపంచాన్ని మార్చేసిన కరోనా : మోడీ

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని మార్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడి వ్యాఖ్యానించారు. శతాబ్దంలోనే ఎన్నడూ లేని ఓ సంక్షోభాన్నికరోనా రూపంలో మనం ఎదుర్కొంటున్నామన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని సందేశం ఇచ్చారు.

ప్రస్తుతం దేశంలో కరోనా రెండో వేవ్ నడుస్తోందని, వందేళ్ళకు ఓసారి వచ్చే మహమ్మారి అని ప్రధాని అన్నారు. కోవిడ్ పై పోరులో డాక్టర్లు, నర్సులు, వాలంటీర్లు అలుపెరగని పోరాటం చేస్తున్నారని మోడీ కొనియాడారు. కోవిడ్ తో బంధువులను, సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాలకు మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఈ మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్నాయని, దేశ ప్రజల భద్రతకు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

ఏడాది కాలంగా ఈ కోవిడ్ పై పోరాటానికి సహకారం అందిస్తున్న వారికి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. బౌద్ధ మతాన్ని ఆచరించేవారు, బౌద్ధ సంఘాలు తమ వంతు సాయం అందించారని గుర్తు చేసుకొంటూ బుద్ధపూర్ణిమ సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్