Sunday, January 19, 2025
HomeTrending NewsBJP: కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం - బండి సంజయ్

BJP: కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం – బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భావోద్వేగ ప్రసంగంతో యావత్ ప్రజలను ఆకట్టుకున్నారు. మాట్లాడింది 5 నిమిషాలే అయినా… నోటి నుండి వచ్చిన ప్రతి పదాన్ని బహిరంగ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఆస్వాదించారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు ఎన్నో అవకాశాలిచ్చిన బీజేపీకి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రకటిస్తూ… పార్టీపట్ల తనకున్న నిబద్దతను చాటుకున్నారు. అదే సమయంలో 140 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇస్తూ ప్రపంచమే ది బాస్ అంటూ కొనియాడే ప్రధాని నరేంద్రమోదీ భుజం తడితే ఎట్లుంటదో… తన భుజాన్ని అడిగితే తెలుస్తోందంటూ వ్యాఖ్యానించారు. మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ధీటుగా ప్రతిస్పందించారు.

6 వేల 100 కోట్ల రూపాయల నిధులను తెలంగాణకు తెస్తున్నందుకు మోదీ వచ్చారు.. వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెస్తున్నందుకు వచ్చారు. స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చినందుకు… కేఎంసీ ఆసుపత్రికి నిధులు మంజూరు చేసినందుకు, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నందుకు వచ్చారు’’అంటూ వ్యాఖ్యానించారు. మరి సీఎం ఇక్కడికి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజలపట్ల చిత్తశుద్ధి, అభివ్రుద్ధి పట్ల కాంక్ష ఉంటే ఇక్కడికి వచ్చి మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మోదీ వద్దకు రావడానికి కేసీఆర్ కు ముఖం చెల్లడం లేదని, ఆయనను చూస్తేనే కేసీఆర్ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు…. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

6 వేల 100 కోట్ల నిధులుతో అభివ్రుద్ది పనులకు ముఖ్యంగా కరీంనగర్ –వరంగల్ జాతీయ రహదారుల పనులు ప్రారంభించేందుకు వచ్చిన మోదీకి ధన్యవాదాలు.

• కొంతమంది ఏ ముఖం పెట్టుకుని మోదీ వచ్చారని అడుగుతున్నారు… 6 వేల 100 కోట్ల నిధులతో అభివ్రుద్ది పనుల ప్రారంభించేందుకు వచ్చారు… రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కేఎంసీ ఆసుపత్రికి నిధులు మంజూరు చేస్తూ వచ్చారు. టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు వచ్చారు… స్మార్ట్ సిటీ నిధులిచ్చినందుకు వచ్చారు..

• కేసీఆర్…..మోదీ నీ దోస్త్ అన్నవ్ కదా? నువ్వెందుకు రాలేదు? రావడానికి నీకు ముఖం లేదు… నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ, అభివ్రుద్ధి ఉంటే ఇక్కడికి రావాలి కదా… మోదీ వస్తే కేసీఆర్ కు కోవిడ్ వస్తది… బిజీ అయితడు..

• మోదీ నా భుజం తట్టి బండి అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇది నా పూర్వ జన్మ సుక్రుతం. ఈ జన్మకు ఇది చాలు… రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ సర్కార్ గడీలను బద్దలు కొడతాం… తెలంగాణలో మోదీ రాజ్యం… కాషాయ రాజ్యం స్థాపించేందుకు నిరంతరం క్రుషి చేస్తాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్