Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్‌, త్రివిక్రమ్ మూవీలో మోహ‌న్ లాల్?

మ‌హేష్‌, త్రివిక్రమ్ మూవీలో మోహ‌న్ లాల్?

Mohan Lal with Mahesh: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకువ‌చ్చాయి. ఇప్పుడు మ‌హేష్‌, త్రివిక్రమ్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వర‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

అయితే.. ఈ సినిమాలో మ‌ల‌యాళ సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషించ‌న‌నున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఇంత‌కీ పాత్ర ఏంటంటే.. ముఖ్యమంత్రి పాత్ర అని.. ఆ పాత్రకు మోహ‌న్ లాల్ అయితే.. క‌రెక్ట్ గా సెట్ అవుతార‌ని త్రివిక్రమ్ ఆయ‌న్ని ఎంపిక చేశార‌ని టాక్ వినిపిస్తోంది. చాలా కాలం క్రితమే తెలుగులో గాండీవం చిత్రంలో న‌టించిన మోహ‌న్ లాల్ ఆత‌ర్వాత‌ ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో న‌టించారు. జనతా గ్యారేజ్ చిత్రం ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత ద‌గ్గర‌య్యారు. ఇప్పుడు మ‌హేష్ బాబు సినిమాలో కీల‌క పాత్ర పోషించనున్నారు.

ఇందులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు స‌మాచారం.

Also Read : మహేష్‌ – త్రివిక్రమ్ మూవీ స్టోరీ ఇదేనా.?

RELATED ARTICLES

Most Popular

న్యూస్