Saturday, April 20, 2024
HomeTrending Newsదావూద్ గ్యాంగ్ టార్గెట్ గా ఈడి తనిఖీలు

దావూద్ గ్యాంగ్ టార్గెట్ గా ఈడి తనిఖీలు

మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్(ED) ఈ రోజు ఉదయం నుంచి ముంబై లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తో పాటు వివిధ దేశాల సంస్థలతో సంబంధాలు ఉన్న వారిగా అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. దావూద్ అనుచరులుగా అనుమానిస్తున్న వ్యక్తుల ఇల్లు, కార్యాలయాలు టార్గెట్ గా ఈడి దాడులు నిర్వహించింది.

దావూద్ ఇబ్రహీం చీకటి సామ్రాజ్యంతో లావాదేవీల వ్యవహారంపై ఇటీవల ముంబై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. దీని ఆధారంగా ఈడి తాజాగా సోదాలు నిర్వహిస్తోంది.  అక్రమ లావాదేవీలతో సంబంధం ఉందని అనుమానిస్తూ ఈ రోజు ఓ వ్యక్తిని ఈడి అదుపులోకి తీసుకుంది. ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ అదుపులో ఉన్న వ్యక్తీ ఎవరు అనేది తెలియరాలేదు. అండర్ వరల్డ్ సహకారంతో భూముల లావాదేవీలు, ఇతర సెటిల్మెంట్లు చేస్తున్న వ్యక్తులు, రాజకీయ నాయకుల చీకటి సంబంధాలు ఈడి విచారణతో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దేశంలో ఉగ్రవాద విస్తరణకు అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్న వ్యక్తులు సహకరిస్తున్నారని కొన్నాళ్ళుగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అనుమానిస్తోంది. ఇటీవలి కాలంలో హవాలా ద్వారా డబ్బుల పంపకాలు పెరిగాయని, మాదక ద్రవ్యాల అక్రమ రావాణ చేయటం ద్వారా చీకటి సామ్రాజ్యం ముంబైతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాజాకీయలను కూడా శాసిస్తోందని కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాలు నివేదిక సమర్పించాయి.

Also Read : కర్ణాటకలో విద్యాలయాలు ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్