Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్పట్టు బిగిస్తాం: మహమ్మద్ షమీ

పట్టు బిగిస్తాం: మహమ్మద్ షమీ

మూడో టెస్టుపై ఇండియా పట్టు బిగించడానికి  ఇంకా అవకాశం ఉందని పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా 78 పరుగుల అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయినప్పటికీ, అప్పుడే మ్యాచ్ కోల్పోయినట్లు భావించాల్సిన అవసరం లేదన్నాడు. తాము కూడా మూడు రోజుల్లో, కొన్ని సమయాల్లో రెండు రోజుల్లో కూడా విజయంతో మ్యాచ్ ముగించిన సందర్భాలున్నాయని, మనది కాని రోజున ఇలాంటివి జరుగుతుంటాయని, వాటికి కుంగిపోయి మానసికంగా నైతిక స్థయిర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని షమీ అభిప్రాయపడ్డాడు.

ఐదు టెస్టుల సిరీస్ లో తాము 1-0 లీడ్ లో ఉన్నామని, ప్రస్తుత టెస్ట్ మ్యాచ్ కాక ఇంకా రెండు మిగిలి ఉన్నాయని, సిరీస్ ను సాధించేందుకు తామకు ఉన్న అవకాశాలు ఏమాత్రం సన్నగిల్లలేదని షమీ ధీమా వ్యక్తం చేశాడు. మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా జట్టు మంచి స్కోరు సాధించవచ్చని, బౌలింగ్ తో ప్రత్యర్థి భాగస్వామ్యాన్ని విడగొట్టడం ద్వారా మ్యాచ్ ను మలుపు తిప్పవచ్చని, ఈ రెంటిలో ఏదైనా జరిగినప్పుడు పరిస్థితి మళ్ళీ మనకు అనుకూలంగా మారుతుందని వివరించాడు.

ఈ సిరీస్ లో ఇప్పటివరకూ 10 వికెట్లు సాధించిన షమీ, లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో కీలక సమయంలో బ్యాట్ తో కూడా మెరిపించారు. అర్ధ సెంచరీ చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్