Friday, March 6, 2026
Homeసినిమాసూపర్ హీరోగా నందమూరి మోక్షజ్ఞ?

సూపర్ హీరోగా నందమూరి మోక్షజ్ఞ?

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయం కోసం నందమూరి అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా కాలం నుంచి రూమర్స్ వినిపిస్తూనే వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేకపోవడంతో, మోక్షజ్ఞకి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదనే మరో టాక్ కూడా వచ్చింది. దాంతో బాలకృష్ణ ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూనే వచ్చారు.  నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న బాలయ్య, తనయుడి ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు.

చాలామంది తలిదండ్రులు తమ పిల్లల కెరియర్ గురించి బెంగ పెట్టుకుంటూ ఉంటారనీ, తనకి అలాంటి బెంగ లేదని బాలకృష్ణ అన్నారు. తాను చాలా సినిమాలు చేసిన తరువాత వచ్చిన క్రేజ్, ఒక్క సినిమా కూడా చేయకుండానే మోక్షజ్ఞ సంపాదించుకున్నాడంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోక్షజ్ఞ గురించి తాను మరీ డీప్ గా ఆలోచించవలసిన అవసరం లేదనీ, అతనికి సెట్టయ్యే ఐదారు స్క్రిప్టులు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. మరో మూడు నెలలలో మోక్షజ్ఞ సినిమా మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.

మోక్షజ్ఞ సినిమాలు చేస్తాడా .. చేయడా? అనే ఒక అయోమయంలో ఉన్న అభిమానులకు సరైన సమాధానం దొరికేసింది. నందమూరి వారసుడి ఎంట్రీ పై స్పష్టత రావడం పట్ల వాళ్లంతా ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నట్టు ఒక టాక్ వినిపిస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఆయన ఒక కథను రెడీ చేశాడనీ, ఈ సినిమాలో మోక్షజ్ఞకి జోడీగా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నటించనుందనే వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. మూడు నెలల్లో మొదలయ్యే ప్రాజెక్టు ఇదే అయ్యుంటుందా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular