కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మరో ప్రమాదం పొంచి ఉంది. మంకీ ఫాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సుమారు 80 కేసులు నమోదయ్యాయని, వైరస్ వ్యాప్తిపై విసృతంగా స్టడీ చేయనున్నట్లు W. H. O తెలిపింది. బ్రిటన్ లో మంకీ ఫాక్స్ కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. జూన్ 26 నుంచి నాలుగు రోజుల్లోనే 1076 కేసులు రాగా, దేశంలోని అన్ని ప్రాంతాల్లో కేసులు వస్తున్నా ఇంగ్లాండ్ లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒక ఇంగ్లాండ్ లోనే వెయ్యి ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
మంకీ ఫాక్స్ కేసులు మరిన్ని పెరగే అవకాశం ఉందని.. ఈ వ్యాధి జంతువుల నుండి మనుషులకు సోకుతుందని తెలిపింది డబ్ల్యూహెచ్ వో.. అయితే మంకీ ఫాక్స్ ప్రమాదకరమైనా… ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మంకీ ఫాక్స్ విపత్తుగా మారే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాలన్నారు.
ఇప్పటికే భారత్ లో కరోనా కేసులు తగ్గిపోయాయని రిలాక్స్ అవుతున్న టైమ్ లో కొత్త వైరస్ కలవరపెడుతోందంటున్నారు వైద్యులు. మంకీ ఫాక్స్ కేసులు ఇతర దేశాల్లో పెరుగుతున్నాయని, మన దేశంలో ఇంకా నమోదు కాలేదని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి ఉంటే.. ఇంకొకరికి తప్పకుండా సోకుతుందని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బ్రిటన్ లో మొదట కోతికి సోకిన ఈ వ్యాధి ఇప్పుడు మనుషులకు సోకుతుందని.. యువకులు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు