పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తన ట్వీట్‌లో తెలిపారు. గరిష్టంగా 20 రోజులపాటు సాగే పార్లమెంటు సమావేశాలలో ప్రజా సమస్యల కన్నా పార్టీల స్వప్రయోజనాలే పరమావధిగా కొనసాగే అవకాశం ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ, రాజస్తాన్ తదితర రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వర్షాకా సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రాజకీయ పార్టీలు పార్లమెంటును వేదిక చేసుకునే అవకాశం ఉంది.
అయితే ఈ దఫా పాత భవనంలోనే వర్షాకాల సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్లమెంట్ భవనంలో ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే సమావేశాలు సజావుగా సాగించేందుకు, ఫలప్రదమైన చర్చలను చేపట్టేందుకు విపక్షాలు కలిసి రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.