Saturday, November 23, 2024
HomeTrending NewsMexico: మెక్సికోలో మండే ఎండలు...50 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు

Mexico: మెక్సికోలో మండే ఎండలు…50 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు

అమెజాన్ అడవులను అంతమొందిస్తున్న బహుళ జాతి సంస్థల స్వార్థానికి అమాయకులు బలవుతున్నారు. లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో అభివృద్ధి పేరిట అడవుల విధ్వంసం వేగంగా జరుగుతోంది. ఈ రెండు ఖండాల్లో పేక మేడల్లా కూలిపోతున్న ప్రభుత్వాలు… పశ్చిమ దేశాల చేతుల్లో  కీలు బొమ్మలుగా ఆడే సైనిక తిరుగుబాట్లు ఈ ప్రాంతపు నైసర్గిక స్వరూపాన్ని మార్చేస్తున్నాయి. దీంతో పర్యావరణ పరిరక్షణ గాలిలో దీపంగా మారింది. అడవుల విద్వంసం, పరిశ్రమల విషతుల్యాలు… జనాభా విస్పోటనం…పరిమితికి మించిన వాహనాల కాలుష్యం వెరసి సమీప ప్రాంతాల్లో వర్షాభావం పెరిగి…ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి.

తాజాగా మెక్సికోలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రచండ భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో దేశంలోని చాలాచోట్ల రికార్డు స్థాయిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడగాలలు వీస్తుండటంతో ఇప్పటివరకు 100 మందికిపైగా చనిపోయారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. వారిలో జూన్‌ 18 నుంచి 24తో ముగిసిన వారంలోనే అత్యధికులు మృత్యువాతపడ్డారని వెల్లడించింది. అంతా హీట్‌ స్ట్రోక్‌తోనే చనిపోయారని తెలిపింది. గతేడాది ఇదే సమయంలో ఎండల వల్ల ఒక్కరు మాత్రమే మరణించారని చెప్పింది.
గత మూడువారాలుగా నమోదవుతున్న ఎండలతో విద్యుత్‌కు రికార్డు స్థాయిలో డిమాండ్‌ పెరిగిందని, దీంతో ఎనర్జీ గ్రిడ్‌ దెబ్బతిన్నదని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో సర్వీసులను నిలిపివేశామని చెప్పింది. సరోనా రాష్ట్రంలోని అకోంచీ పట్టణంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్