Saturday, January 18, 2025
HomeTrending Newsభారతీయ విద్యార్థులకు మరిన్ని వీసాలు

భారతీయ విద్యార్థులకు మరిన్ని వీసాలు

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెల్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త. భారతీయ విద్యార్థులకు వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ మరిన్ని పెంచుతామని ఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్లాట్స్ పెంచుతామని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కొన్ని వారాల్లో అదనపు స్లాట్స్ అందుబాటులోకి వస్తాయని ఎంబసీ వర్గాలు స్పష్టం చేశాయి.

రెండు రోజుల క్రితం స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ ప్రారంభించగా అనూహ్యమైన స్పందన వచ్చింది. జూలై, ఆగస్ట్ నెలల్లో ఇంటర్వ్యూ ల కోసం వేల మంది అపాయింట్మెంట్ తీసుకున్నారు. భారతీయ విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన అపూర్వమైనదని ఎంబసీ పేర్కొంది. ఇప్పటికే వేల మంది స్లాట్ బుక్ చేసుకున్నా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తీసుకునేందుకు ఇంకా వేలల్లో స్లాట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అయితే వీసా అప్లికషన్ పంపేటపుడు సాంకేతికంగా వస్తున్న ఇబ్బందుల్ని రాయబార కార్యాలయ అధికారులు గుర్తించారు. స్లాట్ బుక్ చేసుకునే సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు.  ఇంటర్వ్యూ స్లాట్ తీసుకునే క్రమంలో అదే పనిగా రిఫ్రెష్ చేస్తే అకౌంటు లాక్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

కోవిడ్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రాకపోకలపై అమెరికా కఠిన నిభందనలు అమలు చేస్తోంది.  అయితే ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులకు నిభందనల నుంచి మినహాయింపు ప్రకటించింది. కరోన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రాయబార కార్యాలయాలు, అమెరికన్ కాన్సులేట్ కార్యకలాపాలకు అవాంతరాలు ఏర్పడ్డాయని త్వరలోనే అన్ని సజావుగా పనిచేస్తాయని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్