Thursday, June 18, 2026
HomeసినిమాRe-Release: 'మోసగాళ్లకు మోసగాడు' రికార్ట్ సెట్ చేస్తుందా?

Re-Release: ‘మోసగాళ్లకు మోసగాడు’ రికార్ట్ సెట్ చేస్తుందా?

దివంగత లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి మోసగాళ్లకు మోసగాడు. ఇందులో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు.  సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, గుమ్మడి, నాగభూషణం, జ్యోతిలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కెఎస్ఆర్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పట్లో అతి పెద్ద సంచలన విజయం అందుకున్న ఈ మూవీ, ఆతర్వాత అనేక భాషల్లో విడుదలై అన్నింటా సూపర్ హిట్ సాధించింది. ఓ చరిత్ర సృష్టించింది.

ఇప్పుడు అంతా రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. పోకిరి, జల్సా, సింహాద్రి… ఇలా స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఆ వచ్చే అమౌంట్ ను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. మే 31న కృష్ణ జయంతి. ఈ సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరిగింది. ఈ మూవీ 4కె వర్షన్ ని థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ 4కె ట్రైలర్ ని ఆవిష్కరించారు.

తనకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో మోసగాళ్లకు మోసగాడు ఒకటని, తప్పకుండా ఈ చిత్రం ఫ్యాన్స్ అందరినీ మరొకసారి అలరిస్తుందని ఆశిస్తున్నాను అంటూ మహేష్ బాబు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై అప్పట్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. పోకిరి, జల్సా, సింహాద్రి సినిమాలు రీ రిలీజ్ లో ఒకదానిని మించి మరొకటి రికార్ట్ కలెక్షన్స్ సాధించాయి. మరి.. మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ లో రికార్డ్ సెట్ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular