Saturday, March 14, 2026
Homeసినిమాదసరా బరిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

దసరా బరిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం రిలీజ్ పోస్టర్ విడుదల అయింది. ఇందులో అఖిల్, పూజా హెగ్డే చేతులు పట్టుకొని ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.  సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular