Friday, May 10, 2024
HomeTrending Newsగుర్రపు బండిపై అసెంబ్లీకి....

గుర్రపు బండిపై అసెంబ్లీకి….

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ లో భాగంగా కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు గుర్రపు బండిపై వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. వీరందరినీ అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు అడ్డగించారు, వారిని అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీలూ ఒక్కటేనని అందుకే భారత్ బంద్ కు కెసియార్ మద్దతివ్వలేదని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలపై తిఆర్ఎస్ తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసియార్ భయపడుతున్నారని అయన ఎద్దేవా చేశారు.

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయని భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సీతక్క మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్