Friday, March 29, 2024
HomeTrending Newsఎయిర్ పోర్ట్ కు రంగా పేరు: జీవీఎల్ విజ్ఞప్తి

ఎయిర్ పోర్ట్ కు రంగా పేరు: జీవీఎల్ విజ్ఞప్తి

విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాజ్యసభ భ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు రాజ్యసభ జీరో అవర్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. రంగా అంటే తెలియని తెలుగువారెవరూ ఉండరని, పేదలకు, బడుగుబలహీన వర్గాలకు ఆరాధ్య దైవంగా తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆయన్ను కోలుస్తారని అన్నారు. రాష్ట్రంలో అత్యంత పెద్ద సామాజిక వర్గమైన కాపులకు చెందిన రంగా  కేవలం ఒక్కసారే ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ ఒక గొప్ప ప్రజా నాయకుడిగా పేరుగాంచారని పేర్కొన్నారు.

ఆయన ఓ గొప్ప రాజకీయ శక్తిగా రాష్ట్రంలో ఎదుగుతున్న తరుణంలో…కాపునాడు సభలను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున  నిర్వహిస్తున్న సమయంలో ఆయన్ను హతమార్చారని, ఈ ఘటన ఆయన అభిమానులను దిగ్భ్రాంతిపరిచిందని, ఆయన మరణించి 26ఏళ్ళు గడిచ్చినా ఇప్పటికీ ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆయన్ను తలచుకుంటూనే ఉన్నారని వివరించారు. ఏపీలో కొత్తజిల్లాల ఏర్పాటు సందర్భంగా ఓ జిల్లాకు అయన పేరు పెట్టాలన్న డిమాండ్ వచ్చినా దురదృష్టవశాత్తూ అది జరగలేదని, రంగా పేరును గుర్తుంచుకునే విధంగా కృష్ణా జిలా కు రంగా పేరు పెట్టాలని మరోసారి రాష్ట్రానికి విజ్ఞప్తి చేశారు.  మరోవైపు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను వంగవీటి రంగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా నామకరణం చేయాలని కేంద్ర పౌర విమాన యాన శాఖను కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్