Tuesday, June 9, 2026
HomeTrending Newsపార్టీలో స్థితిగతుల్ని వివరించా - ఎంపి కోమటిరెడ్డి

పార్టీలో స్థితిగతుల్ని వివరించా – ఎంపి కోమటిరెడ్డి

పీసీసీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు(బుధవారం) సాయంత్రం ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రియాంకకు వివరించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం తనను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని కంప్లైంట్ చేసినట్లు సమాచారం. ప్రియాంక గాంధితో భేటీ తర్వాత సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలి అనే అంశంపై ప్రియాంకతో చర్చించానని, మొన్న ఒక ఫంక్షన్ ఉన్న కారణంగా సమావేశానికి రాలేకపోయానని వివరణ ఇచ్చినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. చాలా విషయాలు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని, ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం తను సలహాలు ఇచ్చానన్నారు. టీం వర్క్ తో పనిచేయాలని, ఏ సమస్య ఉన్న తన దగ్గరికి రావాలని ప్రియాంక గాంధీ సూచించారన్నారు. 10 రోజులు తాను అందుబాటులో ఉండనని, వచ్చాక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానన్నారని వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సహా రాష్ట్ర పరిస్థితుల గురించి అర్థవంతంగా చర్చ జరిగిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రియాంకతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. నిన్న రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ నిర్వహించిన సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ముందస్తు అనుమతి తీసుకునే సమావేశానికి హాజరుకాలేదని వెంకట్ రెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. సుదీర్ఘ కాలం పార్టీకి సేవలందించిన తాను.. పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించిన నేపథ్యంలో ఏఐసీసీ నేతల నుంచి పిలుపు వచ్చింది. ప్రియాంకతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని హైకమాండ్ నేతలు కల్పించారు. హైకమాండ్ పిలుపునకు స్పందించిన వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కలసిన అనంతరం.. ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.

Also Read : నా మీద కుట్ర జరుగుతోంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular