బీబీనగర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో మూడవ బ్యాచ్ విద్యార్ధులకు కావాల్సిన భవనాలు, మౌలిక వసతులు కల్పించాలని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయను కోమటిరెడ్డి కలుసుకున్నారు. తొలుత క్యాబినెట్ హోదా పొందినందుకు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీబీనగర్ ఎయిమ్స్ కు అభివృద్ధికి అవసరమైన పనుల గురించి మంత్రికి వివరించారు. కేంద్రమంత్రి వెంటనే స్పందించి వారం రోజుల్లోగా టెండర్లు పిలవాలని తన మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారని కోమటిరెడ్డి వెల్లడించారు.
అనంతరం కార్యదర్శితో తాను వ్యక్తిగతంగా సమావేశయ్యానని, అయన కూడా సానుకూలంగా స్పందించి జాయింటు సెక్రెటరీ ద్వారా విషయం తెలుసుకుని వారం రోజుల్లో భవనం సముదాయ నిర్మాణమునకు టెండర్లు పిలువమని అప్పటికప్పుడు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని కోమటిరెడ్డి వివరించారు.