Thursday, June 18, 2026
Homeసినిమాబుచ్చిబాబు - చరణ్ సినిమాలో మృణాళ్ ఠాకూర్? 

బుచ్చిబాబు – చరణ్ సినిమాలో మృణాళ్ ఠాకూర్? 

మృణాల్ ఠాకూర్ అటు బుల్లితెరకి .. ఇటు వెండితెరకి కొత్తేమీ కాదు. మరాఠీ సినిమాలు .. హిందీ సినిమాలు చేసిన తరువాతనే ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఒక ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫస్టు సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలవడం చాలా తక్కువమంది విషయంలో జరుగుతూ ఉంటుంది. అలాంటి జాబితాలోనే మృణాళ్ ఠాకూర్ చేరింది. తెలుగులో ఆమె చేసిన ‘సీతా రామం’ ఆమెకి పాన్ ఇండియా క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

అప్పటి నుంచి టాలీవుడ్ కి సంబంధించి ఏ కొత్త ప్రాజెక్టు మొదలైనా హీరోయిన్ గా ఆమె పేరు వినిపిస్తూనే ఉంది. నాని తన 30వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో  హీరోయిన్ గా మృణాళ్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో నాని సరసన నాయికలుగా నిత్యా మీనన్ .. సాయిపాల్లవి .. నివేదా థామస్ వంటివారు చేశారు. ఆయన హీరోయిన్స్ నుంచి ఆడియన్స్ గ్లామర్ ను ఆశించరు గనుక, ఆయన జోడీగా మృణాళ్ ఓకే అనిపిస్తుంది.

ఇక తాజాగా చరణ్ సినిమా కోసం మృణాళ్ ను సంప్రదిస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం శంకర్ తో చరణ్ చేస్తున్న సినిమా పూర్తికాగానే, ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మృణాళ్ ను తీసుకోవాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

చరణ్ కి ఉన్న మాస్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఆయన సినిమాలో హీరోయిన్ గ్లామరస్ గా ఉండవలసిందే .. ఆయనతో పోటీపడి డాన్స్ చేయవలసిందే అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. మృణాళ్ కి గ్లామర్ క్వీన్ ఇమేజ్ లేదు. ఆమెకి పేరు తెచ్చిపెట్టిన ‘సీతారామం’ కూడానా క్లాసికల్ హిట్. మరి నటన పరంగా మాత్రమే మెప్పించగలిగే మృణాళ్ ఎంపికలో ఎంతవరకూ నిజముందనేది చూడాలి.

Also Read : చరణ్‌, బుచ్చిబాబు రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular