దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా సినిమా బ్యాన‌ర్స్‌పై అశ్వినీ ద‌త్‌, ప్రియాంక ద‌త్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్క‌ర్ ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. కాగా.. ఈ రాముడి స‌ర‌స‌న సీత‌గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ న‌టిస్తోంది. హృతిక్ రోష‌న్ ‘సూపర్ 30’, జాన్ అబ్రహం ‘బాట్లా హౌస్’.. పర్హాన్ అక్తర్ ‘తుపాన్’ చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించి మెప్పించిన మృణాల్ తొలిసారి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

ఆదివారం మృణాల్ ఠాకూర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఆమె చేస్తున్న సీత పాత్ర‌కు సంబంధించిన గ్లిమ్స్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అద్దంలో నుంచి మృణాల్ ఠాకూర్ ఫొటోను తీస్తున్న దుల్క‌ర్ స‌ల్మాన్‌.. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకునేలా ఉన్న ఆ లుక్ స్క్రీన్‌ పై ఓ ఫ్రెష్ అప్పియ‌రెన్స్‌ ఇస్తోంది.

రొమాంటిక్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో త‌న‌దైన శైలిని చాటుకున్న ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్రేమ కోణాన్ని చూపించ‌ బోతున్నారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ నిర్మిస్తోన్న 7వ చిత్ర‌మిది. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గానే ఈ సినిమా కాశ్మీర్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *