Thursday, March 19, 2026
Homeసినిమాటాలీవుడ్ లో 'సీత'కి పెరుగుతున్న అవకాశాలు!  

టాలీవుడ్ లో ‘సీత’కి పెరుగుతున్న అవకాశాలు!  

టాలీవుడ్ కి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అందం .. అభినయం  ఉన్నవారికి  తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉంటారు.  అలా ఈమధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన కథానాయికలలో ‘మృణాల్ ఠాకూర్‘ ఒకరిగా కనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ పేరు వినగానే చాలామందికి ‘కుంకుం భాగ్య’ సీరియల్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ సీరియల్ తోనే ఆమె పాప్యులర్ అయింది. ఆ సీరియల్ కారణంగానే ఆమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన క్రేజ్ ఆమెను టాలీవుడ్ వరకూ తీసుకుని వచ్చింది.

‘కుంకుం భాగ్య’తో వచ్చిన క్రేజ్ కారణంగా ఆమె వరుసగా మరాఠీ సినిమాలు చేస్తూ వచ్చింది. ‘సీత రామం’  సినిమాలో కథానాయిక కొత్త అమ్మాయి అయితే బాగుంటుందనీ .. సహజంగా నటించే అమ్మాయి అయితే ఆ పాత్రకి న్యాయం జరుగుతుందని భావించిన హను రాఘవపూడి, చివరికి మృణాళ్ ను ఎంపిక చేసుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే ఆమె ఆ పాత్రకి జీవం పోసింది. మృణాళ్ గ్లామరస్ హీరోయిన్ కాదు. తన నటనతో పాత్రలో ఇమిడిపోవడమే ఆమెకి తెలుసు. అందువల్లనే ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది.

‘సీతా రామం’ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన  క్లాసికల్ మూవీగా ప్రశంసలు అందుకుంది. దుల్కర్ తో పాటు మృణాళ్ కూడా ఒక రేంజ్ లో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. దాంతో ఆమెను వెతుక్కుంటూ తెలుగు నుంచి వరుస అవకాశాలు వెళుతున్నాయట. టాలీవుడ్ నుంచి వెళుతున్న కథలను వినడంలో ఆమె బిజీగా ఉందని అంటున్నారు. రానున్న కొత్త ప్రాజెక్టులకి సంబంధించిన జాబితాలో ఆమె పేరు ఎక్కువగా వినిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

Also Read : సీతారామం చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోలు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular