Thursday, June 18, 2026
HomeసినిమాSantosh Shobhan: 'అన్నీ మంచి శకునములే'పై పెరుగుతున్న అంచనాలు!

Santosh Shobhan: ‘అన్నీ మంచి శకునములే’పై పెరుగుతున్న అంచనాలు!

సంతోష్ శోభన్ హీరోగా నందినీ రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ సినిమాను రూపొందించారు. స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సంతోష్ జోడీగా మాళవిక నాయర్ కనిపించనుంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 18వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన దగ్గర నుంచి అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

నందినీ రెడ్డి మంచి డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ కి కావలసిన లవ్ స్టోరీని అందిస్తూనే .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడం ఆమె ప్రత్యేకత. ఇక టైటిల్ ను బట్టే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం తెలుస్తోంది. ఇది ఒక ప్రేమజంటకి ఎదురయ్యే మంచి శకునాలకు  సంబంధించిన కథనే అనే విషయం అర్థమవుతోంది. చాలా గ్యాప్ తరువాత నందినీ రెడ్డి నుంచి రానున్న ఈ సినిమాపై సహజంగానే అందరిలో ఆసక్తి ఉంది.

ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ కి మంచి పేరు ఉంది. ఈ బ్యానర్ పై వచ్చే సినిమాల్లో బలమైన కంటెంట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఏర్పడింది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కవర్ చేసే రాజేంద్రప్రసాద్ .. నరేశ్ వంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాకి అదనపు బలంగానే చెప్పాలి. మిక్కీ బాణీలకు వంకబెట్టవలసిన పనిలేదు. ఏ వైపు నుంచి చూసినా అన్ని శకునాలు బాగానే ఉన్నాయ్ మరి. ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో ఉన్న సంతోష్ కి ఈ సినిమా హిట్ అయితే, అంతకుమించిన మంచి శకునం అతనికి మరొకటి లేదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular