Sunday, January 19, 2025
HomeTrending Newsరాష్ట్రంలో ముల్క్ హోల్డింగ్స్ పెట్టుబడులు

రాష్ట్రంలో ముల్క్ హోల్డింగ్స్ పెట్టుబడులు

Investments: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటుచేసేందుకు దుబాయ్ కు చెందిన ముల్క్‌ హోల్డింగ్స్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముల్క్‌ హోల్డింగ్స్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ ఉల్‌ ముల్క్, వైస్‌ చైర్మన్‌ నవాబ్‌ అద్నాన్‌ ఉల్‌ ముల్క్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ముల్క్‌ హోల్డింగ్స్‌ బిజినెస్‌ ప్రణాళికలపై చర్చించారు.

అల్యుమినియం కాయిల్స్‌ తయారీ, కాయిల్‌ కోటింగ్‌కు ఉపయోగించే హై పర్ఫామెన్స్‌ పెయింట్స్‌ తయారీ, అల్యూమినియం కాయిల్‌ కోటింగ్‌ ప్రొడక్షన్‌ లైన్స్, ఫిల్మ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్, మినరల్‌ కోర్‌స్‌ ప్రొడక్షన్‌ లైన్స్, అల్యూమినియం కాంపోజిట్‌ ప్యానెల్స్, మెటల్‌ కాంపోజిట్‌ మెటీరియల్స్‌ పొడక్షన్‌ లైన్స్‌ ఏర్పాటు చేసేందుకు ముల్క్‌ హోల్డింగ్స్‌ ముందుకొచ్చింది.

ఇటీవల దుబాయ్‌లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటనలో ఏపీ ప్రభుత్వంతో ముల్క్‌ హోల్డింగ్స్‌ ఎంవోయూ చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 1,500 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, రెండు వేలమందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

యూఏఈ హెడ్‌ క్వార్టర్‌గా ముల్క్‌ హోల్డింగ్స్, యూరప్, యూఎస్‌ఏ, ఆఫ్రికా, ఇండియా, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో వ్యాపారాలు చేస్తోంది. 100కు పైగా దేశాలలో మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్‌. యూఏఈ, ఒమన్, సెర్బియా, ఇండియా, టర్కీలో ప్రొడక్షన్‌ బేస్‌. 2,50,00,000 ఎం2 గ్లోబల్‌ ప్రొడక్షన్‌ కెపాసిటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.

సిఎంతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మిడిల్‌ ఈస్ట్, ఫార్‌ ఈస్ట్‌ దేశాలలో ఏపీ ప్రభుత్వ స్పెషల్‌ రెప్రజెంటేటివ్‌ జుల్ఫీ రౌడ్జీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Also Read : మూడు కంపెనీహతో ఏపీ ఎంవోయులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్