Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IPL: మధ్వాల్ మేజిక్ - లక్నో పై ముంబై ఘనవిజయం

IPL: మధ్వాల్ మేజిక్ – లక్నో పై ముంబై ఘనవిజయం

ముంబై బౌలర్ ఆకాష్ మధ్వాల్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లతో లక్నో బ్యాటింగ్ లైనప్ ను దెబ్బ తీయడంతో నేడు జరిగిన ఎలిమినేటర్  మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ 81 పరుగులతో ఘనవిజయం సాధించింది. మరో ముగ్గురు లక్నో ఆటగాళ్ళు రనౌట్ గా వెనుదిరగడం విశేషం. ముంబై ఇచ్చిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  జట్టులో స్టోనిస్-40;  ఓపెనర్ కేల్ మేయర్స్-18; దీపక్ హుడా-15 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ముంబై బౌలర్లలో ఆకాష్ 5; క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా చెరో వికెట్ పడగొట్టారు.

చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కామెరూన్ గ్రీన్-41; సూర్య కుమార్ యాదవ్-33; తిలక్ వర్మ-26; నేహాల్ వధేరా-23 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 4; యష్ ఠాకూర్ 3; మోసిన్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆకాష్ మధ్వాల్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

ఎల్లుండి శుక్రవారం అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్- ముంబై మధ్య క్వలిఫైర్-2 మ్యాచ్ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్