Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ముంబై అద్భుత విజయం

ముంబై అద్భుత విజయం

Mumbai Thrilling win:  ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ తో చివరి బంతి  వరకూ ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో విజయం ముంబైని వరించింది. డానియల్ శామ్స్ వేసిన చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా తొలి బంతికి ఒక పరుగు వచ్చింది, రెండో బంతికి పరుగు రాలేదు, మూడో బంతికి ఒక పరుగుతో పాటు ప్రమాదకర బ్యాట్స్ మెన్ తెవాటియా రనౌట్ అయ్యాడు. నాలుగో బంతికి రషీద్ ఖాన్ కొట్టిన షాట్ గాల్లోకి లేచింది, దీన్ని క్యాచ్ పట్టుకోవడంలో శామ్స్  విఫలమయ్యాడు, ఒక పరుగు వచ్చింది, స్ట్రైకింగ్ మిల్లర్ కు వచ్చింది…. మళ్ళీ ఉత్కంఠ…. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరం కాగా, రెండు బంతుల్లో పరుగులు చేయడంలో మిల్లర్ విఫలం కావడంతో ముంబై 5 పరుగులతో విజయం సొంతం చేసుకుంది.

ముంబై లోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై తొలి వికెట్ కు 74 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లతో 43 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలమై కేవలం 13 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్ తో 45 పరుగులు చేసి మూడో వికెట్ గా, తిలక్ వర్మ 21 పరుగులు చేసి రనౌట్ గా ఔటయ్యారు. పొల్లార్డ్ (4) మరోసారి విఫలమయ్యాడు. చివర్లో టిమ్ డేవిడ్ రాణించి 21 బంతుల్లో 2 ఫోర్లు, 4సిక్సర్లతో 44పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు; అల్జారి జోసెఫ్, ఫెర్గ్యుసన్, ప్రదీప్ సంగ్వాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

గుజరాత్ తొలి వికెట్ కు 106 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లతో 52; వృద్ధిమాన్ సాహా 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశారు. ఇద్దరూ మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యారు.  సాయి సుదర్శన్ (14) పొల్లార్డ్ బౌలింగ్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ పాండ్యా 14  బంతుల్లో 4  ఫోర్లతో 24 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ -19 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు, పొల్లార్డ్ ఒక వికెట్ పడగొట్టారు.

టిమ్ డేవిడ్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : హైదరాబాద్ కు హ్యాట్రిక్ ఓటమి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్