Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్WPL: విజేత ముంబై ఇండియన్స్

WPL: విజేత ముంబై ఇండియన్స్

విమెన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 7వికెట్లతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 131 పరుగులే చేయగలిగింది. ఓ దశలో 79 పరుగులకే 9వికెట్లు కోల్పోయినా శిఖా పాండే- రాధా యాదవ్ 52 పరుగుల భాగస్వామ్యంతో గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. వీరిద్దరూ చెరో 27పరుగులతో నాటౌట్ గా నిలిచారు. టాపార్డర్ లో కెప్టెన్ మెగ్ లన్నింగ్-35; షఫాలీ వర్మ-11; మారిజానే కాప్- 18 రన్స్ చేశారు. ఆలీస్ క్యాప్సీ డకౌట్ కాగా, జెమైమా రోడ్రిగ్యూస్ 9 పరుగులే చేసి పెవిలియన్ చేరింది.

అయితే ముంబై ఈ లక్ష్యాన్ని ఛేదించదానికి చివరి ఓవర్ వరకూ పోరాడాల్సి వచ్చింది. 23 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ (హేలీ మాథ్యూస్-; యస్తికా భాటియా-) ఔటయ్యారు. ఈ దశలో నాటాలి స్కివర్ బ్రంట్- కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. హర్మన్ 37 పరుగులు చేసి రనౌట్ కాగా, బ్రంట్ 55బంతుల్లో 7ఫోర్లతో 60; మెలీ కెర్ర్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయం అందించారు. 19.3ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలుపొంది తొలి టైటిల్ విజేతగా అవతరించింది.

నటాలి బ్రంట్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, హేలీ మాథ్యూస్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular