Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్WPL: తిరుగులేని ముంబై- వరుసగా ఐదో గెలుపు

WPL: తిరుగులేని ముంబై- వరుసగా ఐదో గెలుపు

విమెన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ విజయ యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది.  నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైకి ఇది వరుసగా ఐదో గెలుపు.

ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. కేవలం ఒక్క పరుగు వద్ద హేలీ మాథ్యూస్ డకౌట్ గా వెనుదిరగ్గా.. రెండో వికెట్ కు యస్తికా భాటియా-నాటాలి స్కివర్ బ్రంట్ లు 74 పరుగులు జోడించారు. యాస్తిక-44;  బ్రంట్-36 రన్స్ చేసి ఔటయ్యారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి చెలరేగి 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసింది. అమేలియా కెర్ర్ 19 రన్స్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డ్ నర్ 3; కిమ్ గార్త్, స్నేహ్ రానా, తనుజా కన్వర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

బ్యాటింగ్ మొదలు పెట్టిన గుజరాత్ పరుగుల ఖాతా తెరవకముందే ఓపెనర్ సోఫియా డంక్లీ వికెట్ కోల్పోయింది. సబ్బినేని మేఘన-16; హర్లీన్ డియోల్-22; స్నేహ్ రానా-20; సుష్మవర్మ-18 (నాటౌట్); గార్డ్ నర్-8; దయాలన్ హేమలత-6; మన్షీ జోషి-7 రన్స్ చేయగా సుదర్లాండ్, తనుజా కన్వర్ లు డకౌట్ అయ్యారు.

ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్, నటాలి స్కివర్ బ్రంట్ లు చెరో 3; అమేలియా కెర్ర్ 2; ఇస్సీ వాంగ్ 1 వికెట్ పడగొట్టారు.

హర్మన్ ప్రీత్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్