Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్IPL-Tim David:  రోహిత్ కు బర్త్ డే గిఫ్ట్- రాజస్థాన్ పై ముంబై గెలుపు

IPL-Tim David:  రోహిత్ కు బర్త్ డే గిఫ్ట్- రాజస్థాన్ పై ముంబై గెలుపు

ఐపీఎల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ నేడు జరిగింది. రాజస్థాన్ రాయల్స్ పై6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ ఇచ్చిన 213 పరుగుల విజయ లక్ష్యం కోసం ముంబై కు చివరి నాలుగు ఓవర్లలో 57 పరుగులు కావాల్సిన దశలో టిమ్ డేవిడ్ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 పరుగులతో అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు.  రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చేసిన సెంచరీ వృథా అయ్యింది. నేడు ఐపీఎల్ కెరీర్ లో వెయ్యవ (1000) మ్యాచ్ ఆడుతున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను బిసిసిఐ సన్మానించింది. నేడు అతని పుట్టినరోజు కావడం కూడా విశేషం.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ నుంచే రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్- జోస్ బట్లర్ లు ఎదురుదాడి మొదలుపెట్టారు. మిగిలినవారు ఇలా వచ్చి అలా వెళుతున్నా జైశ్వాల్  క్రీజులో నిలదక్కుకొని అధ్బుతంగా ఆడి 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు రాబట్టి చివరి ఓవర్లో ఔటయ్యాడు. జోస్ బట్లర్-18; సంజూ శామ్సన్-14; హోల్డర్-11 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.  ముంబై బౌలర్ అర్షాద్ ఖాన్ 3; పీయూష్ చావ్లా 2;  ఆర్చర్, మెరెడిత్ చెరో వికెట్ సాధించారు.

భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై లో రోహిత్ శర్మ (3) మరోసారి విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్­ – 28;  కామెరూన్ గ్రీన్ -44; సూర్య కుమార్ యాదవ్-55; తిలక్ వర్మ­-29(నాటౌట్)లు రాణించారు. 19.3 ఓవర్లలోనే ముంబై విజయం అందుకుంది. దీనిద్వారా రోహిత్ కు బర్త్ డే గిఫ్ట్ అందించారు.

రాజస్థాన్ బౌలర్లో అశ్విన్ రెండు; బౌల్ట్, సందీప్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.

సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular