Monday, September 23, 2024
Homeసినిమాతెలుగులో అందుబాటులోకి వచ్చిన 'ముంజ్య'

తెలుగులో అందుబాటులోకి వచ్చిన ‘ముంజ్య’

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకున్న సినిమాల జాబితాలో ‘ముంజ్య’ ఒకటిగా కనిపిస్తుంది. హారర్ కామెడీ జోనర్ లో రూపొందిన సినిమా ఇది. ఈ ఏడాది జూన్ లో విడుదలైన ఈ సినిమా, ఆ తరువాత హిందీలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 130 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమా ఇప్పుడు తెలుగు .. తమిళ భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.

అభయ్ వర్మ .. శర్వరీ .. సత్యరాజ్ .. మోనాసింగ్ తదితరులు నటించిన ఈ సినిమాకి ఆదిత్య దర్శకత్వం వహించారు. స్టార్స్ లేకపోవడం .. పెద్దగా పబ్లిసిటీ కూడా లేకపోవడం వలన, విడుదలకు ముందు ఈ సినిమాను అంతగా ఎవరూ పట్టించుకోలేదు. విడుదలైన తరువాత వసూళ్ల పరంగా ఈ సినిమా దూసుకుపోయింది. కంటెంట్ లోని కొత్తదనం ఈ సినిమాను నిలబెటింది. మౌత్ టాక్ తోనే ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించింది. ఈ సినిమా తెలుగులో వస్తే బాగుంటుందని అనుకున్న ప్రేక్షకుల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది.

కథ విషయానికి వస్తే .. బిట్టూకి తరచూ ఒక కల వస్తూ ఉంటుంది. ఓ పెద్ద రావిచెట్టు .. దానిపై భయంకరమైన ఆకారం .. అతణ్ణి భయపెడుతూ ఉంటాయి. అలా ఆ కల తనకి ఎందుకు వస్తున్నది అతనికి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో అతను ఒక ఫంక్షన్ కోసం తన పూర్వీకుల ఊరుకి వెళతాడు. తన కలలో కనిపిస్తున్న చెట్టును అక్కడ చూస్తాడు. ఆ చెట్టుపై ఉంటున్న ప్రేతాత్మ బిట్టూను ఆవహిస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది కథ. తెలుగు ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్