Friday, March 13, 2026
HomeTrending Newsమునుగోడు బరిలో ప్రజా గాయకుడు గద్దర్

మునుగోడు బరిలో ప్రజా గాయకుడు గద్దర్

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి ప్రజా గాయకుడు గద్దర్ సిద్దమయ్యారు. ప్రజా శాంతి పార్టీ నుంచి మునుగోడులో గద్దర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ప్రజా శాంతి పార్టి అధ్యక్షుడు కే ఏ పాల్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికల పై ప్రజా గాయకుడు గద్దర్ ఇదివరకే కే ఏ పాల్ తో చర్చించినట్టు సమాచారం.

ప్రజా గాయకుడు గద్దర్ మునుగోడు బరిలోకి దిగటంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో విప్లవ పార్టీల ప్రభావం, సిపిఐ, సిపిఎం పార్టీల ప్రభావం మొదటి నుంచి అధికంగా ఉంది. దీంతో దీంతో గద్దర్ పోటీపై ఆసక్తి నెలకొంది. గద్దర్ పోటీకి దిగితే ప్రధాన పార్టీల ఓట్లు కొంత వరకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular