మునుగోడు ఉపఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చిన ఎన్నిక కాదని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నిక ఒక వ్యక్తి స్వార్థం కోసం, ఒక పార్టీ కుట్రలో భాగంగా వచ్చిందన్నారు. మంత్రి జి.జగదీష్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి తన, తన కుటుంబ స్వార్థం కోసం ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని అమ్ముకున్నాడని ఆరోపించారు. గత మూడేళ్ళుగా టచ్ లో ఉన్నా, తనకు ఆరు నెలల క్రితం టెండర్ వచ్చిందని తనే స్వయంగా ఒప్పుకుండని వెల్లడించారు. బహిరంగంగా అమ్ముడు పోయిన..దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి అని అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే నైతికత లేదన్నారు.

రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని, దిగజారుడు రాజకీయాలు చేస్తూ…మేము త్యాగాలు చేసినం అనే మాటలు ఎందుకని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. పైసలు పెట్టి ఏ దుర్మార్గమైనా చేస్తా అనడం…పూటకో మాట.. ఉరుకో అబద్ధం చెప్పడం అన్నదమ్ముల నైజమన్నారు. అభివృద్ధి కోసం రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి…ఎట్లా అభివృద్ధి చేస్తారో ప్రజలు అడుగుతుర్రని, సాధారణ ప్రజలకు ఉన్న ఇంగితజ్ఞానం రాజగోపాల్ రెడ్డికి లేదు…6 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కాదని మూడు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో చేరాదనీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు జాతీయస్థాయిలో వస్తున్న ఆదరణ చూసి కుట్రతో తెచ్చిన ఎన్నిక మునుగోడని, మూడేళ్ళ నుంచి కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తూ..బీజేపీకి లాభం కలిగిస్తూనే ఉన్న అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి కోవర్టుగా బీజేపీకి పనిచేసినా అని బహిరంగంగా ఒప్పుకున్నాడని, బీజేపీ పార్టీకి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలు అవుతాయి…మోటార్లకు మీటర్లు వస్తాయని మంత్రి అన్నారు.

మునుగొడులో టీఆరెస్ అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మూడున్నర ఏళ్లలో మునుగోడు అభివృద్ధి కుంటుపడిందని జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న నన్ను, ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలిసాడా అని ప్రశ్నించారు. అమ్ముడుపోయిన తరువాత అభివృద్ధి మాటలు మాట్లాడుతుండు రాజగోపాల్ రెడ్డి. ధర్మయుద్ధంలో ధర్మం వైపే ప్రజలు ఉంటారన్నారు. మునుగొడులో బీజేపీకి గత ఎన్నికల్లో 12వేల ఓట్లు వచ్చాయి.. మరి ఎందుకు చేరినవ్. ఇప్పటికైతే మునుగొడులో కాంగ్రెస్ బలంగా ఉంది..మాకు పోటీ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వలోపం ఉందని, నాగార్జున సాగర్, హుజుర్ నగర్ లో ఎట్లా అయితే డోకా లేదో..ఇప్పుడు కూడా ఉండదన్నారు. అసంతృప్తి ఎక్కడా లేదు..అసంతృప్తి ఎవ్వరికి లేదని మంత్రి స్పష్టం చేశారు. నేతలు టికెట్ ఆశించడంలో తప్పులేదని, బీజేపీ నుంచి ముఖ్యమంత్రులు వస్తుంటే మేము చిన్నోళ్ళం మంత్రులు ఉంటే తప్పేంటన్నారు. నల్గొండ జిల్లాలో మూడో ఉపఎన్నికను కూడా గెలిచి హ్యట్రిక్ కొట్టి తిరుతామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *