Saturday, November 23, 2024
HomeTrending Newsప్రజలను మభ్యపెడుతున్న టిఆర్ఎస్, బీజేపీ - ఉత్తమ్

ప్రజలను మభ్యపెడుతున్న టిఆర్ఎస్, బీజేపీ – ఉత్తమ్

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఎనగండ్ల తండా, అల్లాపురం, కొయ్యలగూడెం, ఎల్లంబావి, ఎల్లగిరిలో శనివారం జరిగిన గ్రామ స్థాయి సమావేశాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఓటర్లకు పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని వారిలాగే మునుగోడు ఓటర్లు ఉంటారని భ్రమల్లో ఉన్నారని అన్నారు. బీజేపీ, టిఆర్ఎస్ నేతల పనితీరును గ్రామస్తులు ప్రశ్నిస్తుండడంతో ఇరు పార్టీలు స్వేచ్ఛగా ప్రచారం చేయలేకపోతున్నాయన్నారు.

మునుగోడు ప్రజలతో మమేకమై తన తండ్రి స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డితో పాటు ప్రజలకు సేవ చేసిన అర్హత కలిగిన యువతి పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ రెడ్డి (టిఆర్ఎస్), రాజగోపాల్ రెడ్డి (బిజెపి) లకు ఒక్క అవకాశం ఇచ్చారు, ఇద్దరు ప్రజలకు ద్రోహం చేసారని ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఈసారి పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందన్నారు..

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు పట్ల సమాజంలోని ఏ వర్గమూ సంతోషంగా లేదని, నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. మునుగోడులో దాదాపు 40% మంది ఓటర్లు ఉన్నారని, వారికి ఉద్యోగం కల్పించేందుకు బీజేపీ లేదా టీఆర్‌ఎస్ ఏమైనా చేసిందా అని ప్రశ్నించారు. 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నగదు, మద్యంలతో యువత మోసపోవద్దని పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి వస్తుందని అన్నారు. ఉద్యోగం, ఇల్లు, ఇతర వాగ్దానాలు నెరవేర్చాలని ఒత్తిడి చేసి, ప్రయోజనం పొందేలా ఆమె కృషి చేస్తుందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్