Friday, March 29, 2024
HomeTrending Newsరాచకొండ భూములపై కెసిఆర్ కన్ను - రేవంత్ రెడ్డి

రాచకొండ భూములపై కెసిఆర్ కన్ను – రేవంత్ రెడ్డి

గిరిజనులకు వేలాది ఎకరాల భూముల పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక గిరిజనుల భూములపై కన్నేశారన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు సంస్థాన నారాయణపురం మండలం కడీల బావి తండాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గిరిజనుల భూములను గుంజుకుని సినిమా వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల భూములను అమ్ముకునే హక్కు కల్పించాలని కాంగ్రెస్… వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిందన్నారు.

కాంగ్రెస్ హక్కులు కల్పిస్తామంటే టీఆరెస్ హక్కులను కాలరాస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. భూములను గద్దల్లా తన్నుకు పోవాలని చూస్తున్నారని, మల్లన్న సాగర్, డిండి, శివన్నగూడెం భూముల్లా రాచకొండ గిరిజనుల భూములను గుంజుకోవలనుకుంటున్నారని హెచ్చరించారు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి..ఎవరేం ఇచ్చినా తీసుకోండి.. ఓటు కాంగ్రెస్ కు వేయండన్నారు. ఓట్లను అమ్ముకున్నోడు భూములను అమ్ముకోడా అని కెసిఆర్ ను దుయ్యబట్టారు. భూములు అమ్ముకునే హక్కు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని, కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందని అన్నారు. అమ్ముడుపోయిన సన్నాసులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేలాదిగా మునుగోడుకు తరలిరండి…మన వాళ్లపై దాడి చేస్తే తిప్పికొట్టండని రేవంత్ పిలుపు ఇచ్చారు.

Also Read: టిఆర్ ఎస్, బిజెపిలతో తెలంగాణకు చేటు రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్