Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

బీజేపీ బట్టెబాజ్ గాళ్ల మాటలు వింటే గోస పడతరని మంత్రి హరీశ్ రావు మునుగోడు నియోజకవర్గ ప్రజలను హెచ్చరించారు. 15 రోజుల నుండి ఎవరు ఏం చెప్పారో అన్ని విన్నరు. మనకు అన్నం పెట్టినోడుఎవరో…సున్నం పెట్టేటోడు ఎవరో ఆలోచించి నిర్ణయం తీసుకోండని పిలుపు ఇచ్చారు. కేసీఆర్ మనుగోడుకు వచ్చిన తర్వాత బీజేపీవాళ్లు జబ్బలు జార విడిచిండ్రు అన్నారు.  మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల కేంద్రంలో..ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు బిజెపి, కాంగ్రెస్ లపై విమర్శలు సంధించారు.

హరీష్ రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు…

దశాబ్దాల నుంచి ఎంతో మందికి ఓట్లు వేసినం..బీజేపీకి,కాంగ్రెస్. టీడీపీకి ఓట్లువేసినం. కాని గతంలో మంచి నీళ్లు గోస ఎలా ఉండేది. వాటర్ ట్యాంకర్ నుండి నీళ్లు తెచ్చి మీ భుజాలు కాయలు కాయలేదా. ఇవాళ ఇంటింటికి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ ను సాదుకోవాలా…చంపుకోవాలా..మీరే ఆలోచించండి. బీజేపీతో మాట్లాడుకుని రాజ్ గోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టు తెచ్చుకున్నరు. ఇది స్వయంగా రాజగోపాల్ చెప్పుకున్నరు. ఆరు నెలల కింద నాకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు అని. బీజేపీ వాళ్లను సంతోషపెట్టేందుకు రాజీనామా చేసిండ్రు. మునుగోడ ప్రజలకు ఏమైనా వచ్చిందా… కనీసం మహిళలు కూర్చోవడానికి ఓ మహిళా సంఘ భవనం కట్టలే. ఏనాడు మీ దగ్గరకు రాజగోపాల్ రాలే. మీకు 2000 పెన్షన్ ఇచ్చింది ఎవరు, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు. 24 గంటల ఫ్రీ కరెంటు ఇచ్చింది ఎవరు. రైతు బంధు ఇచ్చింది ఎవరు..రైతు బీమా ఇచ్చింది ఎవరు. నీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ఇచ్చింది ఎవరు.. అన్ని ఇచ్చింది కేసీఆర్ సార్…బీజేపి ఏం ఇచ్చింది. బీజేపీ కూడా ఇచ్చింది. 400రూపాయల గ్యాస్ బండ ధరను 1200 చేసింది. రాజగోపాల్ కు 18 వేల కాంట్రాక్ట్ ఇచ్చింది. పెట్రోల్,డిజీల్ ను వంద రూపాయలు తెచ్చిండ్రు. ఉప్పు, పప్పు నిత్యావసర ధరలు పెంచింది. కంపెనీలు అమ్మింది. ఎల్.ఐసీ, బ్యాంకులు, రైళ్లు, రైల్వేస్టేషన్. విమానాలు, ఎయిర్ పోర్టులను అమ్మి మన పిల్లలను రోడ్డు మీదకు తెచ్చిండ్రు.

బీజేపీవాళ్లు మీటింగ్ లు పెట్టి మేం ఈ పని చేసినమని చెప్రిండ్రా. కేసీఆర్ ను తిట్టుడు. జూటా మాటలు..బట్టే బాజ్ మాటలు తప్ప ఒక్క నిజం లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో… బీజేపీ మాటల్లో నీతి, నిజం అంతే ఉంటది. బీజేపీ మీటర్లు పెట్టి రైతుకు బిల్లు పంపండని అంటోందని అని నేను ఒక మీటింగ్లో చెప్పిన. తొండి సంజయ్ ఏమన్నడు. మేం ఎక్కడ మీటర్లు పెట్టమని చెప్పినం అన్నడు. ఉత్తగ చెబుతున్నరు టీఆర్ఎస్ వాళ్లు అన్నరు. ఇది కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీ నుంచి పంపిన ఉత్తరం ఇది. బోరు బాయి కాడ మీటర్ పెట్టండి. మీకు ఏడాదికి ఆరువేల కోట్లు ఇస్తమని రాసిన ఉత్తరం ఇది. బోరు బాయి కాడ మీటర్ పెట్టాలే…బిల్లు మీఇంటికి పంపాలే అని రాసారు. మీటర్ పెట్టమండరా..వద్దా..వద్దంటే…3వతేదీన కారు గుర్తుకు కుయి కుయి కుయి అని ఓటు గట్టిగా నొక్కి వేయాలే..డబుల్ ఇంజన్ సర్కార్ అంటరు..కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. వడ్లు కొనమంటే కొనడం చేత కాదు. కొనలేం అంటే. కేసీఆర్ గారు ప్రతీ గింజ కొన్నడు. వాళ్లు ఏం అన్నరు. నూకలు బొక్కమని చెప్పిండ్రు.ఢిల్లీలోని బీజేపీ నేతలు. ఇలా నూకలు బుక్కమని తెలంగాణ రైతులను అవమానించిన బీజేపీ వాళ్ల తోకలు కత్తిరించాలి. వాళ్లకు మీ ఓటుతో బుద్ధి చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఓటు వేస్తే ఖరాబయితది. బీజేపీవాళ్లు పైసా బలంతో గెలుస్తమంటున్నరు. పైసా బలం గెలవాలా..ప్రజా బలం గెలవాలా. అన్నం పెట్టిన చేయిని మరుస్తమా.. వడ్లు కొనమంటే చేతగాలే..గాని ఎమ్మెల్యేలను కొంటరంట. దెబ్బ కొడితే బేజేపీ దిమ్మ తిరిగింది. కేసీఆర్ గారిదెబ్బకు బీజేపీ నేతలు ముఖం చాటేసుకున్నరు. ఒక్క జాతీయ నాయకుడు ఇటు దిక్కు చూడటం లేదు. ఢిల్లీ బీజేపీ దూతలను చంచల్ గూడ జైళ్లో ఉన్నరు. ఢిల్లీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు. ఇక ఇటు రావడానికి గజ గజ లాడుతున్నరు. ఎమ్మెల్యేలను కొంటం..మా దగ్గర పైసలున్నయి. మాకు ఈడీ ఉంది. ఇన్ కంటాక్స్ ఉందని భయపెట్టిస్తం. కాంట్రాక్ట్ లిస్తం అన్న అంహంకారం ఉంది. ఢిల్లీ అహంకారం గెలవాలా..తెలంగాణ ఆత్మగౌరవం గెలవాలా ఆలోచించండి. అక్కా చెళ్లేళ్లు ఇంటి ముందు నల్లాలను చూడండి. వంట రూంలో గ్యాస్ సిలిండర్ చూడండి. గ్యాస్ సిలిండర్ చూసి కసి కసిగా కారు గుర్తుకు ఓటు గుద్దండి. గ్యాస్ సిలండర్ కు దండం పెట్టండి…కారు గుర్తుకు ఓటు గుద్దండి.

Also Read : టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు – ఎంబిసి నేతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com