బన్నీతో మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన మురుగుదాస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సంచలనం సృష్టించడంతో పుష్ప 2 పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే అల్లు అర్జున్ నెక్ట్స్ చేయబోయే సినిమాల పైన మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే.. అల్లు అర్జున్ తో మురుగుదాస్ మూవీ అని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎలాంటి అప్ డేట్ లేదు. ఇటీవల అల్లు అర్జున్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమాను అనౌన్స్ చేశారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ సినిమాను 2024 చివరిలో సెట్స్ పైకి తీసుకువచ్చేందకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఆగస్ట్ 16 1947 సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు మురగదాస్. ఈ సందర్భంగా బన్నీతో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైయింది. బన్నీతో ప్రాజెక్ట్ లైన్ లో వుందన్నట్లుగానే స్పందించారు మురగదాస్. ఇంతకీ మురుగుదాస్ ఏమన్నారంటే.. హీరో తన కెరీర్‌లో చాలా మంది దర్శకులను కలుస్తాడు. అలాగే డైరెక్టర్‌ కూడా అనేక మంది హీరోలను కలుస్తాడు. ఏదో ఒక సమయంలో ఆ ప్రాజెక్టు మొదలువుతుంది. ప్రస్తుతం మా ప్రాజెక్ట్ ప్రాథమిక దశలోనే ఉంది అని చెప్పుకొచ్చారు మురగదాస్.

ఈ విధంగా అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ లైన్ లో ఉందని.. టైమ్ వచ్చినప్పుడు సెట్ అవుతుందని డైరెక్టర్ మురుగుదాస్ చెప్పారు. దర్బార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.. ఈ మూవీ తర్వాత మురుగుదాస్ నుంచి సినిమా రాలేదు. దీనికి కారణం ఏంటని అడిగితే… కరోనా కారణంగా అందరికీ గ్యాప్ వచ్చింది. ఆ టైమ్ లో చాలా పుస్తకాలు చదివాను. ఎంతో నేర్చుకున్నాను. ఇక నుంచి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తానన్నారు. మరి.. అల్లు అర్జున్ తో మురుగుదాస్ ప్రాజెక్ట్ ఎప్పటికి సెట్ అవుతుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *